Reason behind Matka title:
దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలతో మంచి హిట్స్ చూసిన తెలుగు సినీ ప్రేమికులు ఈ గురువారం థియేటర్లలో విడుదల కానున్న మట్కా సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తన కెరీర్‌లో మరో కీలక విజయాన్ని ఈ సినిమాతో అందుకోవాలని ఆశిస్తున్నారు.
కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపిస్తోంది. తాజాగా సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాన్ని సహనిర్మాత రామ్ తాళ్లూరి ఇటీవల వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం కథ విన్నప్పుడే ఆయనకు చాలా నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగమవాలని అనుకున్నట్లు చెప్పారు.
#Matka teaser is superb. It’s about the life journey of a Matka King. This teaser elevates the cutout of Varun Tej and justifies his height. He is excellent in many getups (as he ages). Dialogues written by Karuna Kumar are powerful. 👍
Looking for the release on 14 Nov! pic.twitter.com/dMxLm00PJK
— idlebrain jeevi (@idlebrainjeevi) October 5, 2024
మొదట ఈ చిత్రానికి బ్రాకెట్ అనే పేరు పెట్టగా, తరువాత మట్కా గా మార్చారు. ఈ పేరు మార్పు ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ముందుకు వచ్చింది. మట్కా లో వరుణ్ తేజ్ విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ పాత్రకు ప్రత్యేకమైన లుక్‌తో పాటు, అతని నటన కూడా ప్లస్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు అంటున్నారు.
ALSO READ: Pushpa 2 final runtime: Sukumar takes another bold risk