Samantha Bollywood Projects:
2023లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ భారీ విజయాన్ని సాధించి, ఆయన కెరీర్‌లోనే ఎక్కువ బాక్సాఫీస్ రాబడిని నమోదు చేసింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,148 కోట్లకు పైగా వసూలు చేసి, ఆ ఏడాది భారతీయ సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.
కథ, తారాగణం, సంగీతం ఈ చిత్రానికి పెద్ద బలంగా నిలిచాయి. జవాన్‌లో నయనతార నటించిన నర్మద రాయ్ పాత్రకు మొదట సమంతను ఎంపిక చేశారని మీకు తెలుసా? అట్లీ 2019లో సమంతను ఈ పాత్ర కోసం సంప్రదించారు. “తేరి,” “మెర్సల్” వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత అట్లీ, సమంతతో మళ్లీ పని చేయాలని భావించారు.
అయితే, ఆ సమయంలో సమంత తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడం కోసం ఈ అవకాశం నిరాకరించింది. తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి కుటుంబాన్ని ప్రారంభించాలని భావించిన సమంత, సినిమాలపై దృష్టి తగ్గించింది. ఆ తర్వాత నయనతార ఈ పాత్రను స్వీకరించారు.
బాలీవుడ్‌లో తొలిసారి నటించిన ఆమె, తన అభినయంతో ప్రతి ఒక్కరిని మెప్పించారు. షారుఖ్ ఖాన్‌తో నయనతార కెమిస్ట్రీ, అట్లీ దర్శకత్వం ఈ సినిమాను రికార్డు స్థాయిలో విజయవంతం చేశాయి. ఈ సినిమా నయనతారను పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది.
ఇదిలా ఉంటే, సమంత తన కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఆమె తాజా వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్ లో రక్త బ్రహ్మండలో కూడా ఆమె కనిపించనుంది.
ALSO READ: Bigg Boss 8 Telugu తో యశ్మీ ఎంత రెమ్యూనరేషన్ సంపాదించిందో తెలుసా?