
Sreeleela adopts two children:
బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ ఊపందుకున్నాయి. తాజాగా, కార్తిక్ తల్లి చేసిన వ్యాఖ్యలతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే, తాజాగా శ్రీలీల గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
2022లో శ్రీలీల అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు, ఇద్దరు ప్రత్యేక శరీరదారులు గురు, శోభితలపై స్నేహభావం ఏర్పడింది. ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆమె వారిని దత్తత తీసుకున్నారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కొందరు శ్రీలీలకు నిజమైన పిల్లలంటూ పుకార్లు పుట్టించుకున్నారు.
View this post on Instagram
ఈ మద్యే కార్తిక్, శ్రీలీల అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీలో జంటగా నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. దీపావళి 2025న సినిమా విడుదల కాబోతుంది. టీజర్‌లోని రొమాంటిక్ సీన్స్ చూసిన ఫ్యాన్స్ వీళ్లిద్దరి కెమిస్ట్రీని తెగ మెచ్చుకుంటున్నారు.
శ్రీలీల 2019లో కన్నడలో ‘కిస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తరువాత తెలుగులో వరుస విజయాలు సాధించారు. చిన్న పాత్రలతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటున్నారు.
ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో వీరి పేర్లు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చూడాలి మరి, రాబోయే రోజుల్లో వీరి లవ్ స్టోరీకి ఎలాంటి ట్విస్ట్ వస్తుందో!
ALSO READ: నాని నిర్మించిన Court సినిమా ఏ OTT లో స్ట్రీమ్ అవుతుంది అంటే