
Sobhita Dhulipala Movies:
శోభిత ధూళిపాళ పేరు ఇప్పుడు అందరికీ పరిచయమే. కానీ ఈ రోజు ఆమె ఉన్న స్థాయికి రావడానికి చాలా కష్టం ఎదుర్కొంది. మొదట ఆమెకి ఫెయిర్ స్కిన్ లేదని, కమర్షియల్ హీరోయిన్‌గా పనికి రాదని అనేక మంది చెప్పిన సందర్భాలున్నాయి. అసలు ఒకసారి ఓ యాడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మోడల్‌గా కూడా సెలెక్ట్ కాకుండా, ఆమె స్థానంలో ఓ కుక్కను తీసుకున్నారట!
శోభిత ధూళిపాళ కెరీర్‌కి మిస్ ఇండియా పోటీ ఒక పెద్ద మలుపు. 2013లో ఆమె ఆ పోటీలో పాల్గొని, “మిస్ ఫోటోజెనిక్”, “మిస్ బ్యూటిఫుల్ ఫేస్” వంటి టైటిల్స్ గెలుచుకుంది. దీంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తరువాత నటనపై ఆసక్తి పెంచుకొని అవకాశాల కోసం ప్రయత్నించింది.
View this post on Instagram
2016లో “రామన్ రాఘవ్ 2.0” అనే సినిమాతో ఆమె వెండితెరకి పరిచయమైంది. ఆ తర్వాత “షెఫ్”, “గూడాచారి”, “కురుప్” వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆమెకు నిజమైన బ్రేక్ “మేడ్ ఇన్ హేవెన్” వెబ్‌సిరీస్‌తో వచ్చింది. ఈ సిరీస్ ఆమెను దేశవ్యాప్తంగా పాపులర్ చేసింది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన మరో విషయం – శోభిత ధూళిపాళ, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య వివాహం. డిసెంబర్ 4, 2024న వీరి పెళ్లి సింపుల్‌గా జరిగినా, మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
ఒకప్పుడు అవకాశాలు రాక సతమతమైన శోభిత, ఇప్పుడు అగ్రశ్రేణి నటిగా వెలుగొందుతోంది. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, తిరస్కారాలు, వాటిని దాటుకుని సాధించిన విజయాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి.