
Shah Rukh Khan Mannat Secrets:
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇంటి పేరు వినగానే “మన్నత్” గుర్తొస్తుంది. అది కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, షారుక్ కలల మహలుగా మారింది. కానీ ఈ ఇంటికి ఒక గొప్ప చరిత్ర ఉంది.
ఇది మొదట విల్లా వినియనా అని పిలిచేవారు. 1800లలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి రాజ్యం రాజు బిజై సేన్ దీన్ని తన రాణికి బహుమతిగా నిర్మించాడు. కానీ ఆయన మరణం తర్వాత ఇది విక్రయానికి వచ్చింది.
1915లో పార్శీ వ్యాపారవేత్త పెరిన్ మానేక్జీ బట్లీవాలా దీన్ని కొనుగోలు చేసి, విల్లా వినియనా అని పేరు పెట్టాడు. అతను వియన్నా సంగీతాన్ని ఇష్టపడేవాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. ఇన్నాళ్లూ ఇది వ్యాపారవేత్తల చేతుల్లో మారుతూ వచ్చింది.
1997లో యెస్ బాస్ షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్ ఈ ఇంటిని చూసి మక్కువ పెంచుకున్నాడు. చివరికి 2001లో దీన్ని రూ. 13 కోట్లకు కొనుగోలు చేశాడు. మొదట జన్నత్ అని పేరు పెట్టాడు, కానీ తర్వాత మన్నత్గా మార్చాడు.
View this post on Instagram
ఇప్పుడు ఈ భవనం 6 అంతస్తులుగా ఉంది. గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైన్ చేసింది. ఇందులో ఉండేవి:
*విశాలమైన బెడ్రూమ్‌లు
*ప్రైవేట్ థియేటర్
*స్విమ్మింగ్ పూల్
*జిమ్
*గ్రాండ్ లైబ్రరీ
2024లో షారుక్ మరో రెండు ఫ్లోర్లను జోడించేందుకు పనులు ప్రారంభించాడు. ఇప్పుడు దీని విలువ రూ. 250 కోట్లు. మన్నత్ కేవలం ఓ భవనం కాదు, షారుక్ కష్టపడితే సాధించగలమని నిరూపించే చిహ్నంగా మారింది!