
Samantha in Pushpa Item Song:
పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, అల్లు అర్జున్, సుకుమార్‌ల హవా ఏంటో చూపించింది. ఇప్పుడు అభిమానులు పుష్ప 3 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఊ అంటావా మావా పాట గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
‘రోబిన్ హుడ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవి శంకర్ షాకింగ్ రివీల్ చేశారు. ముందుగా ఈ పాట కోసం కేతికా శర్మ ను సంప్రదించారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ అవకాశం కోల్పోయింది. ఆ తర్వాత సమంతా పాటకు ఒప్పుకుని, దానిని ఇంటర్నేషనల్ లెవెల్ హిట్ చేసింది.
‘రొమాంటిక్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మ, ఇటీవల రాబోయే చిత్రం ‘రోబిన్ హుడ్’ లో ఆధి ఢ సర్ప్రైసు అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇక శ్రీ విష్ణు సరసన ‘సింగిల్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.