
Salman Khan Family:
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కొత్త లుక్ తో మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సికందర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన క్లీన్ షేవ్ అవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కొందరికి ఈ స్టైల్ నచ్చగా, మరికొందరికి భాయ్ ఎప్పటిలా లేడని అనిపించింది. అయితే, ఈ కొత్త లుక్ తో ఆయన ఆఫ్గాన్ రూట్స్‌పై మళ్లీ చర్చ మొదలైంది.
కొందరు అభిమానులు “సల్మాన్ ఖాన్ కు ఆఫ్గాన్ మూలాలు ఉన్నాయా?” అని ప్రశ్నించగా, సమాధానం అవును!
View this post on Instagram
సల్మాన్ ఖాన్ ముత్తాత అన్వర్ ఖాన్ ఓ పఠాన్. ఆయన ఆఫ్గానిస్తాన్ నుండి భారత్‌కు వలస వచ్చి భోపాల్‌లో స్థిరపడ్డారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సేవలందించిన అన్వర్ ఖాన్ కుమారుడు అబ్దుల్ రషీద్ ఖాన్, ఇండోర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేశారు.
సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ముస్లిం, తల్లి సల్మా ఖాన్ (మునుపు సుశీలా చరక్) డోగ్రా రాజ్‌పుత్. అందుకే ఆయన మిక్స్‌డ్ కల్చర్ కుటుంబంలో పెరిగారు.
సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసిన అభిమానులు పలు రకాలుగా స్పందించారు. “భాయ్ గడ్డం తెల్లబడుతోంది”, “మన చిన్నప్పటి హీరో ఇప్పుడు ముసలివాడు అవుతున్నాడా?”, “బిఫోర్ హ్యాండ్సమ్.. నౌ హ్యాండ్సమ్.. ఫారెవర్ హ్యాండ్సమ్!”, “సలీం ఖాన్ లానే కనిపిస్తున్నాడు.”, “విశ్వంలోని అందమైన వ్యక్తి – సల్మాన్ ఖాన్!” ఇలా ట్విట్టర్ లో సల్మాన్ లుక్ గురించి డిస్కషన్ నడుస్తోంది.
ఆఫ్గాన్ ప్రజలకు బాలీవుడ్ అంటే ఎంతో ఇష్టం. అనేక మంది హిందీ భాష నేర్చుకోవడానికి బాలీవుడ్ సినిమాలను చూసేవారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు అక్కడ ప్రత్యేకమైన అభిమాన బేస్ ఉంది.
2025 ఈద్‌కు సల్మాన్ ఖాన్ ‘సికందర్’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట!
ALSO READ: Mad Square పోస్టర్ విషయంలో వెనక్కి తగ్గిన మేకర్స్