HomeTelugu TrendingGame Changer సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్ర వెనుక రహస్యం ఇదే!

Game Changer సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్ర వెనుక రహస్యం ఇదే!

DYK Ram Charan’s Game Changer Role Is Inspired by This Real IAS?
DYK Ram Charan’s Game Changer Role Is Inspired by This Real IAS?

Game Changer IAS officer inspiration:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన Game Changer సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్ ఐఏఎస్ అధికారిగా కనిపించాడు. మరీ ఈ పాత్రకు ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్ ఐఏఎస్ అని తెలుసా? ఆ అధికారి ఎవరో తెలుసుకుందాం.

ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ మేకర్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. చరణ్ మూడు లుక్స్‌లో కనిపించాడు – యంగ్ కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా అప్పన్న అనే తండ్రి పాత్ర. అయితే ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అందరిని ఆకట్టుకుంది. చరణ్ చెప్పినట్టు, ఈ పాత్రకు ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి టీ.ఎన్. శేషన్.

తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ అని పిలువబడే టీ.ఎన్. శేషన్ 1990-96 మధ్య ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న సంస్కరణలు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఎన్నికల ప్రక్రియలో అవినీతిని అడ్డుకొని, ఆచరణలో ఎన్నో కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. ప్రభుత్వాలను, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను గడగడలాడించిన శేషన్ గురించి చరణ్ కూడా అభిమానంగా చెప్పాడు.

షూటింగ్ టైమ్‌లో శేషన్ వీడియోలు చూసి, ఆయన వర్క్ మేథడ్స్ ఫాలో చేశానని రామ్ చరణ్ వెల్లడించాడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడం గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే మెగా ఫ్యాన్స్ భారీ సెలబ్రేషన్స్ చేసేశారు. సినిమాకు కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ వస్తుండగా, మరికొన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.

ALSO READ: Sookshmadarshini OTT లో తెలుగులో ఎప్పటినుండి చూడచ్చంటే..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu