HomeTelugu News'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' టీజర్ రెస్పాన్స్!

‘దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌’ టీజర్ రెస్పాన్స్!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం ‘డి.జె. దువ్వాడ జగన్నాథమ్’. డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలై ట్రెమెండస్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
ఈ సంద‌ర్బంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్ మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా హ్యాట్రిక్ మూవీ ఇది.  మ్యూజికల్ హిట్ మూవీస్ జోడి బన్ని, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు కూడా ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలుస్తుంది. ఇటు ప్రేక్షకులను, అటు మెగాభిమానులను అలరించేలా మా బ్యానర్ చాలా  ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu