అల్లు అర్జున్ కిడ్స్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ టీజర్ చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14వ తేదీ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే.. టీజర్‌లో బన్నీ కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కనిపించి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
అయాన్, అర్హల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ముద్దు ముద్దు స్టెప్పులు చూసి అందరూ మురిసిపోతున్నారు. ఈ సాంగ్ టీజర్ ఇప్పటికే రెండు మిలియన్లకి పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే అర్హ, అయాన్‌ల పిక్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
చిల్డ్రన్స్ డే రోజు బన్నీ భార్య స్నేహా రెడ్డి పిల్లలిద్దరూ కలిసి ఉన్న పిక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.. స్పెషల్‌గా చేసిన ఫోటో షూట్‌లో అన్నాచెల్లెల్లు క్యూట్‌ఎక్స్ ప్రెషన్స్‌తో భలే ఉన్నారు. ఈ ఫోటోకు విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి..