రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. RAPO20గా తెరకెక్కుతున్ ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. స్కందలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్‌రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ పాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో పాటను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా ఎస్ థమన్ కంపోజిషన్‌లో వచ్చే డుమ్మారే డుమ్మారే సాంగ్‌ను విడుదల చేశారు. పల్లెటూరి అందాల నడుమ కుటుంబసమేతంగా కలర్‌ఫుల్‌గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఇంప్రెస్ చేయడం ఖాయమని లిరికల్ వీడియో సాంగ్ చెబుతోంది. ఈ సాంగ్‌ను ఎప్పటిలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
స్కంద నుంచి బోయపాటి టీం ఇప్పటికే లాంఛ్ చేసిన స్కంద పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తు్న్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లా్క్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.