సూపర్ స్టార్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్ మాస్ లుక్ కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ మరియు పోస్టర్లు ఫ్యాన్స్‌ని వీపరితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేసారు.
ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ థమన్ మాస్ బీట్లు ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది. `ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండీ.. ఎగబడి ముందరకే వెళ్లిపోతాది నేనెక్కిన బండి` అంటూ సాగే పాటతో ప్రోమో మొదలవుతుంది.
బ్యాక్ గ్రౌండ్ లో మహష్ ఎలివేషన్లు అదిరిపోయాయి. గుంటూరు కారానికి మసాలా బిర్యానీ ఘాటు తోడైతే ఎలా ఉంటుందో? మహేష్ ని వీలైనతంగా మాస్ కోణంలో హైలైట్ చేసారు. ఇది మహేష్ మాస్ ఎంట్రీ సాంగ్ లా ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హాసిని-హారికా క్రియేషన్స్ నిర్మిస్తోంది.