HomeTelugu Big StoriesDulquer Salman in Kalki: కల్కి సీక్వెల్ లో దుల్కర్ సల్మాన్ పాత్ర ఇలా ఉండబోతోందా?

Dulquer Salman in Kalki: కల్కి సీక్వెల్ లో దుల్కర్ సల్మాన్ పాత్ర ఇలా ఉండబోతోందా?

Dulquer
Dulquer Salman in Kalki sequel to surprise fans

Dulquer Salman in Kalki: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా జూన్ 27న విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి కలెక్షన్లు అందుకుంటూ కల్కి సినిమా విజయ శంఖం పూరించింది.

ఇక సినిమా చూసిన అందరూ ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు రాబోతుందా అని ఎదురు చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడి సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక చిన్న కామియో పాత్రలో కనిపించారు.

కానీ దుల్కర్ సల్మాన్ పాత్రకి కనీసం రెండు మూడు డైలాగులు కూడా లేవని, ఊరికే ఒక పది సెకండ్లు మాత్రమే చూపించారు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ నేపధ్యంలో మరికొందరు మాత్రం కల్కి సీక్వెల్ లో దుల్కర్ సల్మాన్ కి మంచి పాత్ర ఉంటుంది అని ఊహాగానాలు చేస్తున్నారు.

అయితే వాళ్లు చెబుతున్నది పూర్తిగా అబద్ధం అని చెప్పలేం. వాళ్లు అనుకున్నట్లుగానే దుల్కర్ సల్మాన్ పాత్ర కల్కి 2 లో కూడా కనిపించే అవకాశం ఉంది. కల్కి 2898 ఏడి సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రభాస్ పాత్రకి గురువుగా కనిపించారు. చిన్నప్పటి నుంచి తనకి ఎలా బతకాలి అన్నీ నేర్పించింది ఆయనే అని భైరవ పాత్ర లో ప్రభాస్ చెబుతారు.

Dulquer Salman in Kalki:

ఇప్పుడు భైరవ నే కర్ణుడు అని సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహాభారతం ప్రకారం కర్ణుడికి విలువిద్యలు, యుద్ధ విద్యలు నేర్పించింది పరసురాముడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే పరశురాముడు కూడా చిరంజీవి. కలియుగం అంతం అయిపోయేదాకా పరశురాముడు కూడా బతికే ఉంటాడు.

కాబట్టి కల్కి సీక్వెల్ లో దుల్కర్ సల్మాన్ పరశురాముడి పాత్రలో కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం సినిమాపై అంచనాలు ఇంకా భారీగా పెరిగిపోతాయి అని చెప్పుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu