టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కోసం మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పాట పాడారు. పాడి మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ విజయ్ కొత్త చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ వెర్షన్ కోసం పాడారు. పాట చాలా బాగా వచ్చిందని మూవీ యూనిట్ చెబుతోంది. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకురానుంది.