దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కోటా’. తాజాగా ఈ చిత్రం టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ‘కింగ్ ఆఫ్ కోటా’ టీజర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. దుల్కర్ సల్మాన్ ను మరోసారి ఆకట్టుకునే పాత్రలో చూస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
‘కింగ్ ఆఫ్ కోటా’ మూవీ టీజర్ ను మహేశ్ బాబు విడుదల చేయడం పట్ల దుల్కర్ సల్మాన్ స్పందించారు. “థాంక్యూ సో మచ్ అన్నా” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ బాబు వంటి స్టార్ హీరో తమ మూవీ టీజర్ విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘కింగ్ ఆఫ్ కోటా’ చిత్రబృందం అంతా ఇప్పుడు సంతోషంతో పొంగిపోతుందని దుల్కర్ సల్మాన్ వివరించారు.
తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్న డైలాగ్స్‌తో సాగుతున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, డాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్ తదితరులు నటిస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ టీజర్