జగన్ రెడ్డికి ముక్కుసూటితనం ఎక్కువ అంటుంటారు ఆయన అభిమానగణం. కానీ, ముక్కుసూటితనం వేరు, మూర్ఖత్వం వేరు. ముక్కుసూటితనం అనేది హీరో లక్షణం. మూర్ఖత్వం అనేది జీరో లక్షణం.అసలు ముక్కుసూటితనం అంటే .. ఓ నిర్ణయం తీసుకున్నాక అవసరం అయితే వెనక్కి తగ్గి, ముందుకు పోవడం. ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్ ది ముక్కుసూటితనం. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. కానీ, ఎన్టీఆర్ కు అలాంటి జిత్తులు తెలియవు. ఆయనకు మంచి చేయాలనే లక్ష్యం మాత్రమే ఉండేది. రాజకీయాలు చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అందుకే, సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ముక్కుసూటితనం గానే వెళ్లేవారు.
ఇక మూర్ఖత్వం విషయానికి వద్దాం. జగన్ రెడ్డికి ఈ లక్షణం చాలా ఎక్కువ. అందుకే, జగన్ రెడ్డికి సలహాలిచ్చే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. సలహా దారులు లెక్కకు మించి ఉన్నా.. జగన్ రెడ్డికి సలహా ఇచ్చే నాథుడే లేకుండా పోయాడు. ఆ స్థాయిలో జగన్ రెడ్డిలో మూర్ఖత్వం పేరుకుపోయి ఉంది. మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు ఆయనవే. కానీ, వాటి ఫలితాలు మాత్రం రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఓ నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయకపోవడం ముక్కుసూటితనం అనుకుం టున్నాడు జగన్ రెడ్డి. అసలు అది కాదు ముక్కుసూటితనం అంటే.
తీసుకున్న నిర్ణయంలో పొరపాటు ఉంటే.. ఆ నిర్ణయం విషయంలో వెనకడుగు వేసి, ముందుకు వెళ్లడమే ముక్కుసూటితనం. ఇది తెలియని మూర్ఖుని చేతిలో రాష్ట్రం పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆ దుష్ట ఫలితాలు అనుభవించక తప్పదు. ముఖ్యంగా రాజధాని విషయంలో. మూడు రాజధానుల బిల్లులపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇచ్చినా, జగన్ రెడ్డి మాత్రం తగ్గేదే లే అంటున్నాడు. ఉగాది తర్వాత ఏ క్షణమైనా విశాఖ నుంచి పాలన సాగిస్తామని మంత్రులు పదేపదే చెప్పడానికి కారణం జగన్ రెడ్డి మూర్ఖత్వమే. మరోవైపు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ రెడ్డి సర్కార్ వేసిన పిటిషన్‌పై విచారణ మరింత జాప్యం అవుతూనే వుంది.
ఈ నేపథ్యంలో రాజధాని విషయమై జగన్ రెడ్డి మాత్రం మంకు పట్టు వీడడం లేదు. జగన్ కి పోయేది ఏముంది ?, పిచ్చి పిచ్చి మందు బ్రాండ్ లను పట్టుకొచ్చి హ్యాపీగా వేల కోట్లు దోచుకున్నాడు. ఆ పిచ్చి మందు తాగి ఇప్పటికే రాష్ట్రంలోని సగంమంది మందు బాబులు తమ ఇంట్లో ఆర్ధికశక్తిని, ఒంట్లో జీర్ణశక్తిని కోల్పోయారు. ఏది ఏమైనా చరిత్రలో కనీవినీ ఎరుగని నీచపాలనను జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు అందిస్తున్నాడు.