తెలుగు పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఏమూలనైనా ఎక్కడో చోట తెలుగు పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రాంతాలు, దేశాలు అందుకు అడ్డుకట్ట కాబోవని తాజాగా ఓ దుబాయ్ షేక్ నిరూపించారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో కేవీ మహదేవన్ సంగీత సారథ్వంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ‘విధాత తలపున…’ అనే పాట ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు.
లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను ఇప్పుడు దుబాయ్‌కు చెందిన ఓ షేక్ పాడి వినిపించారు. టిక్‌టాక్ కోసం పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. సంగీతంపై ఆయనకున్న మక్కువను తెలియజేసింది. సంగీతానికి భాషాబేధాలు లేవని, నేర్చుకోవాలనే తపన ఉంటే చాలని నిరూపించాడు దుబాయ్ షేక్.