ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డ్రైవర్ జమున’. పి.కిన్ స్లిన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఆమె ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన జమున అనే ఓ లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో.. ఈ క్రైమ్ థిల్లర్ తెరకెక్కించారని అర్థం అవుతోంది. ట్విస్టులు కీలక మలుపులతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగిన ‘డ్రైవర్ జమున’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. గోకుల్ బినోయ్ సినిమాటోగ్రఫీ అందించారు. అనిల్ అరసు యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేశారు. 18 రీల్స్ బ్యానర్ పై ఎస్పీ చౌదరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.