ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ (50) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం నుండి లివర్ సిరోసిస్‌తో అనే వ్యాదితో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగాలేక ఆయన ఇటీవల (31 july) హైదరాబాద్‌లో గచ్చిబౌళిలో AIG ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే గతంలో ఆరోగ్యం కుదుటపడినట్టు కనిపించినప్పటికీ ఆ వ్యాదీ ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన్ను వెంటనే హస్పిటల్‌లో చేర్చారు. నిషికాంత్ కామత్ ‘అజయ్ దేవ్‌గన్’ హీరోగా వచ్చిన దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఆయన అంతకు ముందు.. మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి హిందీలో మంచి పేరు సంపాదించాడు. నిషికాంత్ కామత్.. కొన్ని మరాఠీ చిత్రాలల్లో కూడా నటించాడు. నిషికాంత్ 2005లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మరాఠీ సినిమాలో ఆ సంవత్సరం అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది.