HomeTelugu Big StoriesNTR తన నెక్స్ట్ సినిమా విషయంలో కీలక అప్డేట్స్ బయటపెట్టేశారుగా

NTR తన నెక్స్ట్ సినిమా విషయంలో కీలక అప్డేట్స్ బయటపెట్టేశారుగా

Dragon Takes Off: NTR makes Big Reveal About His Next
Dragon Takes Off: NTR makes Big Reveal About His Next

NTR – Prashanth Neel Movie:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవర వచ్చే వారం థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన తరువాత సినిమా గురించి కీలక అప్‌డేట్‌ను బయట పెట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

“ప్రశాంత్ నీల్ అక్టోబర్ 21 నుంచి ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. నా పాత్రకి సంబంధించిన షూటింగ్ కాకుండా 40 రోజుల పాటు ఇతర సీన్స్‌ను షూట్ చేస్తారు. నేను 2025 జనవరి నుండి సెట్స్‌కి వెళ్తాను,” అని ఎన్టీఆర్ అన్నారు.

Read More: Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం దేవర 2 పై పని చేయనున్నారట. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu