సామాజిక మాధ్యమలల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉన్నట్టుండి ట్విట్టర్‌లో నల్లటి కళ్లజోడుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. కళ్లజోడులో కేటీఆర్ అదిరిపోయాడే అనుకుని ట్వీట్ పరిశీలిస్తే గానీ, అసలు విషయం తెలియలేదు.. కేటీఆర్‌కు కండ్లకలక సోకిందని. దీంతో సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఉదయం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి శాసనమండలి కార్యాలయానికి వచ్చిన కేటీఆర్.. కళ్లకు ఇబ్బందిగా అనిపించడంతో వైద్యుల వద్దకు వెళ్లారు. కేటీఆర్‌ను పరీక్షించిన వైద్యులు.. కండ్ల కలక సోకిందని గుర్తించారు. దీంతో మూడు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఇక తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసిన కేటీఆర్.. తన కండ్లకలక గురించి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కేటీఆర్‌కు ఈ విధంగా విశ్రాంతి దొరికింది. మరోవైపు త్వరలోనే జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 32 జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మరోవైపు కేటీఆర్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Down with viral conjunctivitis; grounded for next 3-4 days 😎
Lots of binge watching happening😀 pic.twitter.com/pAWb6Ueeck
— KTR (@KTRTRS) April 15, 2019