Double iSmart Vs Mr Bachchan:
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా.. రామ్ పోతినేని హీరోగా ఆగస్టు 15న విడుదల కి సిద్ధం అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ముంబైలో సినిమాకి సంబంధించిన కొన్ని పనులతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ ఈవెంట్ కి రాలేకపోయిన సంగతి తెలిసిందే. కానీ ప్రతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగానే.. హీరో, డైరెక్టర్ల ఏవీలు డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా చూపించారు.
నాలుగు నిమిషాలు ఉన్న ఆ వీడియో రవితేజ వాయిస్ తో మొదలైంది. ఆ తర్వాత ఇడియట్ పోస్టర్ అన్ని పోస్టర్లతో పాటు గుంపులో గోవిందం లాగా కలిసిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా పూరితో హిట్ సినిమాలు తీసిన హీరోలు అందరి ఈ వీడియోలు కనిపించాయి. కానీ అందులో ఒక్క చోట కూడా రవితేజ కనిపించలేదు.
రవితేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు. ఈ ఐదు సినిమాల్లో నాలుగు కమర్షియల్ గా విజయాలను సాధించినవే. ఇక ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకున్నాయి.
ఇలా పూరి జగన్నాథ్ నాలుగు సార్లు హిట్ కొట్టిన హీరో రవితేజ వీడియోలు కనీసం ఒక్క సెకండ్ కూడా కనిపించకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కావాలనే రవితేజని సైడ్ చేశారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి డబ్బులు ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుంది అని చెత్త బృందం ప్రకటన చేసింది.
ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది అని ప్రకటన వచ్చింది. డబల్ ఇస్మార్ట్ టీం కి ఈ వార్త షాక్ ఇచ్చింది. దీంతో తమ సినిమాతో పాటు ప్రకటించడం పూరి జగన్నాథ్ కి నచ్చలేదు అని.. ఈ విషయంలో కోపంగా ఉన్న పూరి కావాలని రవితేజని చూపించలేదని కొందరు అంటున్నారు. అందులో నిజం ఎంత ఉందో పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పాలి.