Double iSmart Review:
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చినా లైగర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కి వచ్చిన నష్టాలను తట్టుకోలేక డిస్ట్రిబ్యూటర్లు సినిమాని నిర్మించిన పూరి జగన్నాథ్ ని నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఎన్నో గొడవలు చేశారు. చాలా కాలం పాటు ఈ గొడవలు నడిచాయి.
కొన్నాళ్లు ఈ గొడవలు సద్దుమణిగాయి అనుకుంటున్నా సమయంలో.. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల చేయడానికి ఈ ప్లాన్ చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ ఉన్న అప్పులు తీర్చకుండా కొత్త సినిమా విడుదల చేసేది లేదు అంటూ తిరగబడ్డారు. దీంతో పేరుకి ఆగస్టు 15 విడుదలను ప్రకటించినప్పటికీ.. సినిమా విడుదల అవుతుందో లేదో అని క్లారిటీ రాలేదు.
ఇక నిర్మాతలలో ఒకరైన చార్మి ముందుకు వచ్చి తీర్చాల్సిన మొత్తంలో 40% ఇస్తానని.. కానీ ఈ సినిమా విడుదల అయ్యాకే వచ్చిన డబ్బులతో తీరుస్తాను అని చెప్పుకొచ్చారు. ముందు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోయినా.. తర్వాత చేసేది లేక ఓకే అన్నారు. అనుకున్నట్టుగానే సినిమా ఇవాళ అనగా ఆగస్టు 15న విడుదలైంది.
కానీ ఉదయం నుంచి సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తోంది. కనీసం అభిమానులు కూడా సినిమా మీద పాజిటివ్ కామెంట్లు చేయడం లేదు. దీంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వారు కూడా పూరి మీద తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా లైగర్ అప్పులే తీరలేదు అని అనుకుంటుంటే.. ఇప్పుడు Double iSmart సినిమా కారణంగా డబుల్ అప్పులు ఏర్పడ్డాయి. మరి ఇవన్నీ ఎప్పటికీ తీరుతాయో ఏమో కానీ.. పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమాల విషయంలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు.