జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం..భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తొలి పాటను ‘ఫ్రెండ్‌షిప్ డే’ సందర్భంగా ఆగస్ట్1న ఉయయం 11గంటలకు విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కనిపించారు. ‘ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం..ప్రాణానికి ప్రాణం ఇస్తుందో, తీస్తుందో’…అంటూ సాగిన ఈ సాంగ్ చివర్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం హైలైట్‌గా నిలిచింది.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, ఎం.ఎం. సంగీతం సంగీతం అందించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ వివిధ భాషల్లో ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సాంగ్ పాడిన ఐదుగురు సింగర్స్ ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేసినట్లు సమాచారం. అక్టోబర్ 13న విడుదల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.