HomeTelugu Big Stories'మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే'.. 'దొరసాని' ట్రైలర్‌

‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’.. ‘దొరసాని’ ట్రైలర్‌

3సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దొరసాని’. ఈ చిత్రంలో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ సోమవారం విడుదల చేశారు. ఓ గ్రామంలో దొరసాని అయిన శివాత్మికను.. కూలీ పని చేసుకునే ఆనంద్‌ ఇష్టపడతాడు. శివాత్మిక కూడా ఇష్టపడుతుంది. విషయం తెలిసి ఆమె తండ్రి ఆనంద్‌ను చంపించాలనుకుంటాడు. కొన్నేళ్ల పాటు అతన్ని చెరసాలలో బంధిస్తారు. చివరికి దొరసాని, ఆనంద్‌ ఒక్కటయ్యారా? అన్నదే కథ. గొప్పింటి ఆడపిల్లను ఓ పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రైలర్‌ చివర్లో దొరసానికి దూరంగా ఉండాలంటూ ఆమె బావ ఆనంద్‌ను బెదిరిస్తూ.. ‘ఉద్యమంలా చావు కూడా ఓ విజయం’ అని బెదిరిస్తాడు. ఇందుకు ఆనంద్‌.. ‘మా ప్రేమ కూడా ఒక ఉద్యమమే’ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu