నటీనటులు: నయనతార, తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: వివేక్
సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
ఎడిటింగ్: గోపికృష్ణ
నిర్మాత: మల్కాపురం శివకుమార్
దర్శకుడు: దాస్ రామసామి
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోన్న నటి నయనతార. మయూరి అనే హారర్ సినిమాలో నటించి మెప్పించిన ఈ భామ ఇప్పుడు మరోసారి అదే జోనర్ ను ఎన్నుకొని ‘డోర’ అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
పారిజాతం(నయనతార) తన తండ్రి(తంబి రామయ్య)తో కలిసి నివశిస్తుంటుంది. తనొక కాల్ టాక్సీ బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది పారిజాతం. దానికోసం తన తండ్రితో కలిసి ఓ పాతకాలపు వింటేజ్ కార్ తీసుకుంటుంది. అయితే ఆ కార్ లో ఏదో ఉందని డ్రైవర్ పారిజాతనికి చెబుతాడు. దీంతో తనే స్వయంగా ఆ కార్ ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకానొక సంధర్భంలో కార్ పారిజాతం కంట్రోల్ తప్పి దానంతటదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏమవుతుందో అర్ధం కానీ స్థితిలో పారిజాతం ఉండగా.. కార్ వెళ్ళి ఓ వ్యక్తిని యాక్సిండెంట్ చేసి చంపేస్తుంది. దీంతో భయపడిపోయిన పారిజాతం
కార్ ను అక్కడే వదిలేసి ఇంటికి పరుగులు తీస్తుంది. కార్ కూడా అక్కడ నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోతుంది. మళ్ళీ ఆ కార్ ఇంటికి రావడం చూసి పారిజాతం షాక్ తింటుంది. ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రాసెస్ లో పారిజాతానికి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ విషయాలు ఏంటి..? అసలు కార్ లో ఏముంది..? కార్ ఎవరి మీదనైనా.. పగ తీర్చుకుంటుందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
నయనతార
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
సంగీతం
విశ్లేషణ:
కారులో దెయ్యం ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే డోర స్పెషల్ ఏంటంటే ఆ ఆత్మ ఓ కుక్కది. కుక్క పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దాన్ని తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. సినిమా మొదటి భాగం మొత్తం చాలా భారంగా నడిచింది. సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయ్యేవరకు మెయిన్ కథ మొదలవ్వలేదు. పోనీ అప్పుడైనా సినిమా గ్రిప్పింగ్ గా ఉందా..? అంటే అదీ లేదు. అనవసరపు సన్నివేశాలు, సాగతీతతో విసుగు పుట్టించేశారు. ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం ఆకట్టుకుంది. సినిమాలో ఎక్కడా.. హారర్ ఉండదు. ఈ సినిమా ప్రధాన బలం నయనతార అనే చెప్పాలి. ఆమె ప్రదర్శించిన నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సన్నివేశంలో ఆమె నటన ఆమె నటన మరింత ఆకట్టుకుంది. తంబి రామయ్య, హరీష్ ఉత్తమన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్, సంగీతం సో.. సో.. గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఉన్నత స్థాయిలో సినిమాను తీశారు. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాను చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు దాన్ని ఆసక్తి కరంగా చెప్పే విషయంలో ఫెయిల్ అయ్యాడు.
రేటింగ్: 2/5