PVR INOX money refund:
PVR INOX గురించి అందరికీ తెలుసు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్క్రీన్లను కలిగిన సినిమా చైన్. ఇప్పుడు ఈ అగ్రశ్రేణి చైన్ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ గురించి వివరాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ కొత్త విధానం ప్రకారం, ప్రేక్షకులు సినిమా నచ్చకపోతే.. చూసిన సమయంలోనే బయటకు వెళ్లిపోయి.. టికెట్ ధరలో కొంత మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. సినిమా ఎంత సమయం చూసారో, దానికి అనుగుణంగా డబ్బులు తిరిగి ఇస్తారు. ఇది వినడానికే చాలా కొత్తగా ఉంది కదా!
ఈ ప్రాజెక్ట్ మొదట ఢిల్లీ ప్రాంతంలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ కొత్త విధానాన్ని ఢిల్లీ ప్రజల మీద ప్రాథమికంగా పరీక్షించి, ఫలితాలు బాగుంటే, దేశవ్యాప్తంగా అమలు చేయాలని PVR భావిస్తోంది.
అయితే, ఈ ప్రోగ్రామ్ కొంత అదనపు ఛార్జ్‌తో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. టికెట్ ధరపై 10% అదనంగా చెల్లించి ఈ సేవ పొందవచ్చు. దీనివల్ల ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఫిల్మ్ ఎంజాయ్‌మెంట్ కోసం మరింత స్వేచ్ఛ లభిస్తుంది.
మనం చాలా సార్లు చూసిన సినిమాలు నచ్చకపోయినా, టికెట్ డబ్బులు వృథా కాకూడదనే కూర్చుంటాం. అలాంటి పరిస్థితిని తప్పించడానికి ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది అమల్లోకి వస్తే, ప్రేక్షకుల అనుభవాలను మరింత మెరుగుపరుస్తుందనే చెప్పాలి. మరి ఈ కొత్త విధానం విజయవంతమవుతుందా? దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ALSO READ: ఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!