HomeTelugu Newsనేను క్షేమం.. ఎలాంటి వదంతులు సృష్టించవద్దు: రాజశేఖర్

నేను క్షేమం.. ఎలాంటి వదంతులు సృష్టించవద్దు: రాజశేఖర్

8 16

ప్రముఖ నటుడు రాజశేఖర్ తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అంటున్నారు‌. ‘కల్కి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌ గాయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రెస్‌నోట్‌ ద్వారా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం విషయం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయని, దయచేసి ఇలాంటి వదంతులు సృష్టించవద్దని రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

‘పది రోజుల క్రితం ఓ స్టంట్ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు గాయపడ్డాను. కానీ నేను విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే సినిమాలో ఎందరో నటీనటులు ఉన్నారు. నా కారణంగా వారు సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ను మార్చుకోమని చెప్పలేను. ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. ‘కల్కి’ సినిమా షూటింగ్‌ నిమిత్తం నా కుటుంబం, చిత్రబృందంతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు, మనాలీకి వెళ్లాను. మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడ్డాయి. దేవుడి దయ వల్ల ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ‌అందమైన కులు మనాలి ప్రాంతంలో చిత్రీకరణ బాగా జరగాలని కోరుకుంటున్నాను. నా ఆరోగ్యం విషయం గురించి అభిమానులు, కుటుంబీకుల నుంచి విపరీతంగా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. నా ఆరోగ్యం గురించి ఇంతగా ఆరాతీస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక నా ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులు సృష్టించొద్దు’ అని రాజశేఖర్ కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu