భారత పర్యటనలో భాగంగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్యతో కలిసి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇక ప్రధాని మోడీ స్వయంగా సబర్మతి ఆశ్రమం విశిష్టత, మహాత్మాగాంధీ అక్కడ గడిపిన వివరాలను ట్రంప్‌కు దంపతులకు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి మోడీతో కలిసి నూలు దండ వేసి నివాళులర్పించారు ట్రంప్. తన షూస్ విప్పి ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఆశ్రమంలోని హృదయ్‌కుంజ్‌లో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖాపై ట్రంప్ దంపతులు నూలు వడికారు. చరఖా పనివిధానాన్ని అక్కడి సిబ్బంది వివరించగా ఆసక్తిగా తెలుసుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా సబర్మతి ఆశ్రమంలో గడిపారు. అక్కడ సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ”టు మై గ్రేట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ… థాంక్యూ ఫర్ దిస్ వండర్‌ఫుల్ విజిట్” అంటూ రాసి సంతకం పెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇక, ఆయన సంతకం కింద మెలానియా ట్రంప్ కూడా సంతకం చేశారు. మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు ఇష్టం, ఆయన అంటేనే గౌరవం. భారత్ అంటే ఇష్టం లేదు అనే తరహాలో వ్యవహరిస్తున్న ట్రంప్… చివరకు తన చేతల్లో కూడా అదే చూపించారే? అనే కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు నెటిజన్లు.
Gujarat: US President Donald Trump writes a message in the visitors’ book at the Sabarmati Ashram, ‘To my great friend Prime Minister Modi…Thank You, Wonderful Visit!’ pic.twitter.com/mxpJbSMg4W
— ANI (@ANI) February 24, 2020