భారత్‌లో ఈ నెల 25 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశల వారీగా విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సమాచారం అందింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 22 నుంచి దేశంలో డొమెస్టిక్ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో సరుకు రవాణా, కొన్ని అత్యవసర సర్వీసుల విమానాలు మాత్రమే నడిచాయి. మరో 5 రోజుల్లో పౌర విమాన సర్వీసులు మొదలు కానున్నట్లు విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. అన్ని విమానాశ్రయాలు, సంస్థలకు సమాచారం అందించినట్లు, విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.