Nayanthara: Beyond the Fairy OTT release date
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార జీవితానికి అంకితమైన డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond the Fairy Tale’ నవంబర్ 18, 2024న ఆమె పుట్టినరోజు సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా నయనతార తన సాధారణ ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్న తన ప్రస్థానాన్ని చూపించానున్నారు.
నయనతార తన నటనతో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు పొందారు. ‘Beyond the Fairy Tale’ అనే డాక్యుమెంటరీలో ఆమె చిన్ననాటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రయాణం, ఆమె వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక పాయింట్లు చూపించనున్నారు.
Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨
Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024
నయనతార అసలు పేరు డయానా మారియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించి, కేరళలోని తిరువల్లా ప్రాంతానికి చెందిన మలయాళీ సిరియన్ క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమనా కురియన్.
తన కెరీర్‌ను మలయాళం సినిమా ‘మనస్సినక్కరే’తో ప్రారంభించి, తర్వాత తమిళంలో ‘అయ్యా’, తెలుగులో ‘లక్ష్మి’, కన్నడలో ‘సూపర్’ చిత్రాలతో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 75కి పైగా సినిమాల్లో నటించి అనేక అవార్డులు గెలుచుకున్నారు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, నంది అవార్డు, SIIMA అవార్డులు వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.
‘Nayanthara: Beyond the Fairy Tale’ డాక్యుమెంటరీలో ఆమె జీవితంలోని అనేక పునాదులు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ చాలా అద్భుతంగా చూపించనున్నారు.
ALSO READ: Bigg Boss 8 Telugu లో నిఖిల్ మీద మండి పడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..