’96’ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో సినీ నటుడు శర్వానంద్ భుజం, కాలికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. భుజం భాగంలోని ఎముక డిస్‌లొకేట్ అయ్యిందని శర్వాకు చికిత్స అందిస్తున్న సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డా. గురవా రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి గురించి గురవారెడ్డి మాట్లాడుతూ..
‘శర్వానంద్‌తో నాకు 15 ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మా కుటుంబసభ్యుడిగా భావిస్తుంటాను. దురదృష్టవశాత్తు థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రమాదంలో తన భుజం భాగంలోని ఎముక విరిగి ఐదారు ముక్కలైంది. చిత్రబృందం వెంటనే మా ఆస్పత్రిలో చేర్చింది. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాం. నాతో కూడిన మా బృందం నాలుగు గంటల పాటు శస్త్ర చికిత్స చేసింది.’
”ఐదు గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేశాం ఎముక ముక్కలవడంతో శస్త్ర చికిత్స నిర్వహించడానికి చాలా సమయం పట్టింది. ఆపరేషన్ తర్వాత మూడు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాం. నిన్న సాయంత్రం ఐదు గంటల తర్వాత ఐసీయూకి మార్చాం. ఈరోజు ఉదయం 11.30కు రూమ్‌కు షిఫ్ట్ చేశాం. కుడి భుజానికి గాయమవడంతో చెయ్యి మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తాం. ఇది కాకుండా కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. ఈ రెండు గాయాలు తప్ప శర్వాకు ఎలాంటి సమస్యలు లేవు. త్వరగా కోలుకుంటాడు’ అని వెల్లడించారు.
Sunshine Hospitals Managing Director Dr. Guruva Reddy speaks on #Sharwanand’s shoulder surgery.
The surgery was a successful one but #Sharwa needs at least two months time to recover pic.twitter.com/I1lkDWKMe7
— BARaju (@baraju_SuperHit) June 18, 2019