Highest tax paying hero 2024:
ఒక సినిమా కోసం పని చేసే మిగతా వారితో పోలిస్తే అందరి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకునేది సినిమాలో నటించే హీరో. ఎందుకంటే ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే.. ప్రేక్షకులను థియేటర్లు దాకా తీసుకురావాల్సిన బాధ్యత హీరో మీదే ఉంటుంది. సినిమాకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ అయిన హీరో కి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది.
పైగా ఈ మధ్య ప్యాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయి.. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. బడ్జెట్లో సగం హీరోల రెమ్యూనరేషన్ కి అయిపోతుంది. ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్లు అందుకుంటున్న హీరోలు టాక్స్ ఎంత కడతారు అని ఎప్పుడైనా ఆలోచించారా?
తాజాగా విడుదలైన నివేదిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2023 – 2024 ఆర్థిక సంవత్సరం నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన హీరో షారుఖ్ ఖాన్. 10 కాదు 20 కాదు ఏకంగా 92 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించారు షారుక్ ఖాన్.
షారుఖ్ ఖాన్ తర్వాత కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ 80 కోట్లు పన్ను చెల్లించి రెండవ స్థానంలో నిలిచారు. 75 కోట్లు పన్నుతో సల్మాన్ ఖాన్ మూడవ స్థానం ఆక్రమించారు. 71 కోట్లు ఆదాయపు పన్ను కట్టిన అమితాబ్ బచ్చన్ నాలుగవ స్థానంలో ఉన్నారు. అయితే ఆసక్తికరంగా 2022లో అత్యధిక టాక్స్ కట్టిన హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ పేరు ఇప్పుడు టాప్ లో లేకపోవడం షాక్ గా మారింది.
ఇక హీరోయిన్లలో 20 కోట్లు పన్ను చెల్లించి కరీనాకపూర్ మొదటి స్థానంలో ఉండగా.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ రెండవ స్థానంలో.. కత్రినా కైఫ్ మూడవ స్థానంలో నిలిచారు. ఇక టాప్ 20 అత్యధిక ఆదాయపు పన్ను కట్టిన సెలబ్రిటీలలో 16వ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారు. టాప్ 20 లో ఉన్న ఒకే ఒక తెలుగు హీరో అల్లు అర్జున్. 14 కోట్ల పన్ను చెల్లించారు బన్నీ .