మహానటి కీర్తిసురేష్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నానితో కలిసి దసరా సినిమాలో మెరిసింది. ఈ సినిమా ఆమె చేసిన వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ జీవించింది.
కెరీయర్ పరంగా బిజీగా ఉండే కీర్తిసురేశ్ టైం దొరికితే స్నేహితులతో సరదా సమయాన్ని ఆస్వాదించేలా ప్లాన్ చేసుకుంటుందని తెలిసిందే. అయితే కీర్తిసురేష్ ఓ హ్యాండ్స్ సమ్ బాయ్‌తో ఉన్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కీర్తిసురేష్ తోపాటు ఆ వ్యక్తి కూడా ఒకే కలర్ షర్ట్ వేసుకోవడం స్టిల్ లో చూడొచ్చు. ఇంతకీ అతడి పేరేంటో తెలుసా..? ఫర్హాన్ బిన్ లియాఖత్. ఇటీవలే బర్త్ డే జరుపుకున్నాడు.
ఈ సందర్భంగా హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. అని కీర్తిసురేశ్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ధన్యవాదాలు కిట్టీ అని రిప్లై ఇచ్చాడు ఫర్హాని. దీంతో కీర్తిసురేశ్ పక్కనుంది ఆమె బాయ్‌ఫ్రెండ్ అంటూ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమి లేదని, ఫర్హానీ- కీర్తిసురేశ్ మంచి స్నేహితులని మరో వార్త తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కీర్తిసురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్‌లో చిరు సోదరి పాత్రలో నటిస్తోంది.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు