ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ? అని ప్రత్యేకంగా అడక్కర్లేదు. కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు తెలియాలంటే న్యూస్ చూడవద్దు. ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఒక మాజీ కాంగ్రెస్ మంత్రి ఉన్నారు. ఆయన వారానికి ఒకసారి లేదా నెలకొకసారి ప్రెస్ మీట్ పెడతారు. అందులో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది ?, ఏం చేయడం లేదు ?, అసలు జగన్ రెడ్డి చేసేది తప్పా ?, రైటా ?, జగన్ రెడ్డి పాలన కారణంగా రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ? అనేది నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు ఉండవల్లి స్పష్టంగా చెబుతున్నారు. బహుశా ఉండవల్లిని జగన్ రెడ్డి దగ్గరకు రానియ్యలేదు అనుకుంటా. అందుకే.. ఆయన తనదైన శైలిలో జగన్ రెడ్డి బాగోతాలను బయటకు కక్కుతున్నారు.
సరే.. ఇంతకీ ఉండవల్లి చెబుతున్న దాని ప్రకారం, జగన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం బాగా లేదు. టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇతర వసతులు కోత పెట్టి, పేదలకు (అనబడే వారి అనుయాయులకు) ఉచిత పథకాలుగా అంద జేస్తున్నారు. దీని వలన జగన్ కి ఓట్లు పడ వచ్చేమో కానీ అభివృద్ధి మాత్రం జరగదు అని ఉండవల్లి చెప్పుకొచ్ చాడు. నిజమే.. జగన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం గా మిగిలిపోయాడు. అభివృద్ధి లేదు, రాష్ట్రంలో వలసలు పెరిగిపోయాయి, మరోవైపు నిరుద్యోగం రోజురోజుకు పరిధులు దాటుతుంది. అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రం అంతా గోతుల మయమైన రోడ్లు, వీటికి తోడు టీవీ సీరియల్ లాంటి వివేకానంద హత్య కేసు ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ రెడ్డి పై ఎన్నో వ్యతిరేకతలు.
అంతేనా.. ఆంధ్ర మందు బాబుల అసంతృప్తి గురించి మరో మహాభారతం రాయొచ్చు. ఇక ఎంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. జగన్ రెడ్డి అవినీతి కారణంగా.. తాము ప్రత్యేకంగా ఏమి పోగేసుకోలేదనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఘోష పెడుతున్నారు. ఉద్యోగుల నుండి ఉండే వ్యతిరేఖత చెప్పలేనంత. కనిపించే విధంగా ప్రతిపక్షాల పై దౌర్జన్యం లాంటి పలు విషయాలు కూడా జగన్ రెడ్డి పై ప్రజల్లో తీవ్రంగా ద్వేషాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే.. విజయ అవకాశాలను దెబ్బ తీయవచ్చు.
అయితే, అట్టడుగు వర్గాలకు పలు పథకాలు ఇచ్చాను, కాబట్టి ఆ లబ్ది దారులు తనకు ఓటు వేస్తారు అనే అపారమైన నమ్మకం జగన్ రెడ్డిలో ఉంది. ఎలాగూ తనకు అనుకూలమైన కొన్ని కుల సమీకరణాలు ఉన్నాయి. సో.. ఇవన్నీ తన విజయానికి దోహద పడవచ్చు అనేది జగన్ రెడ్డి అభిప్రాయం. అందుకే, వైఎస్సార్సీపీ ఒంటరి పోరుకు సై అంటుంది. పైగా జగన్ రెడ్డిలో గెలుస్తాం అనే ధీమా పెరుగుతూనే ఉంది. కానీ జగన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం గా రాష్ట్ర ప్రజల్లో బలమైన ముద్రను సాధించారు.
దీనికితోడు తెలుగుదేశం గెలుపు దిశగా ఇప్పటికే అడుగులు వేసేసింది. చంద్రబాబు సమర్ధవంతమైన పాలకుడని, బాబుకు మంచి అనుభవం ఉందని ప్రజల్లో మళ్లీ చర్చ మొదలైంది. దీనికితోడు వైసీపీ ఓటు శాతం 49.95 నుండి 41% కు తగ్గింది అని రిపోర్ట్స్ చెబుతున్నారు. మరో సంవత్సర కాలంలో ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయం.