బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ఆమె సోదరి రంగోలీ సోషల్ మీడియాలో కొనియాడింది. కంగనా తాను సంపాదించిన సొమ్ములో కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. కంగనా ఎప్పుడూ అందరితోనూ మంచిగా ఉంటుందని, తనకు ఎవరితోనూ ఇబ్బందులు ఉండవని, ఆమెను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కంగనా 21 ఏళ్ల వయసులో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణానికి సహాయం చేశారని తెలిపింది. అదేవిధంగా వివేకానంద ఆశ్రమం వారు గ్రామాల్లో చేపట్టే పలు సేవా కార్యక్రమాల్లో కంగనా పాల్గొన్నట్టు తెలిపింది. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు సాయం చేసిన యోగా గురువు సూర్యనారాయణకు రూ.2.5 కోట్ల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చినట్టు తెలిపింది. కావేరీ నదీ సంరక్షణకు తనవంతుగా కొంత సహాయం చేసిందని రంగోలీ తెలిపింది.