బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారానికి చేరుకోవడంతో నేటి నామినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ముందుగా ఎవర్ని నామినేట్ చేస్తే బావుంటుందన్న దానిపై మహేష్, వరుణ్, పునర్నవిల మధ్య చర్చ నడిచింది.
ఈ వారం నామినేషన్ ప్రక్రియ షురూ.. త్యాగాలు ఇవిగో..
ఈవారం నామినేషన్స్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఈ ఫోన్ ద్వారా కంటెస్టెంట్స్‌తో మాట్లాడారు. మొదటిగా ఫోన్ రింగ్ కావడంతో ఆవేశంగా వచ్చి ఎప్పటిలాగే అత్యుత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రీముఖి. అయితే ఆమె మొదటిగా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల నేరుగా నామినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ నుండి బయటపడే అవకాశాన్ని ఇచ్చారు.
బాబా భాస్కర్ గెడ్డం క్లీన్ షేవ్ చేసుకుంటే మీరు నామినేషన్ నుండి సేవ్ అవుతారని లేదంటే మీరు డైరెక్ట్‌గా నామినేట్ అవుతారని అనడంతో బాబా భాస్కర్‌కి విషయాన్ని చెప్పింది శ్రీముఖి. దీనికి బాబా భాస్కర్ ఓకే చెప్పి క్లీన్ షేవ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. రాహుల్.. బాబా భాస్కర్‌కి క్లీన్ షేవ్ చేసి మాస్ అవతారం నుండి క్లాస్ అవతారంలోకి తీసుకువచ్చాడు.
పునర్నవి నేరుగా నామినేట్ కావడంతో ఈమెను సేవ్ చేయడానికి రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాడు. దీంతో నామినేషన్ నుంచి పునర్నవి సేవ్ అయింది. తనకోసం 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగిన రాహుల్‌ని గట్టిగా హగ్ చేసుకుని పునర్నవి ముద్దు పెట్టింది.
వరుణ్‌ని సేవ్ చేయడానికి శ్రీముఖి బిగ్‌బాస్ ఐ ట్యాటూ వేయించుకోవాలి. శ్రీముఖి ఈ టాస్క్ కంప్లీట్ చేసింది. వరుణ్ ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు.
మహేష్‌ను ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడానికి హిమజ తాను ధరించిన దుస్తులు మినహా మిగతా అన్ని వస్తువులు, దుస్తులు అన్నీ స్టోర్ రూంలో పెట్టాలి. ఈ టాస్క్‌లో కొన్ని దుస్తులు మిగిలిపోయాయి. ఈ టాస్క్ హిమజ పూర్తి చేయకపోడంతో మహేష్ నామినేట్ అయ్యాడు.
బాబా మాస్టర్ నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి రవి తన దగ్గరున్నషూష్ అన్నీ పెయింట్‌లో ముంచాలి. రవి ఈ టాస్క్ పూర్తి చేయడంతో బాబా సేవ్ అయ్యాడు.
శివజ్యోతిని సేవ్ చేయడానికి మహేష్ తన జుట్టు మొత్తానికి రెడ్ కలర్ వేసుకోవాలి. ఈ టాస్క్ మహేష్ పూర్తి చేయడంతో శివజ్యోతి సేవ్ అయింది.
హిమజను సేవ్ చేయడానికి వరుణ్ పేడ తొట్టెలో బిగ్‌బాస్ తదుపరి ఆదేశం వచ్చేవరకు పడుకుని ఉండాలి. ఈ టాస్కలో వరుణ్ విన్ అయ్యాడా? అని బిగ్‌బాస్ సస్పెన్స్‌లో పెట్టాడు. రేపటికి వాయిదా వేశాడు.