HomeTelugu Big Storiesలుక్ కోసం నోరా ఫతేహి ఏం చేసిందో తెలుసా..!

లుక్ కోసం నోరా ఫతేహి ఏం చేసిందో తెలుసా..!

8 23
శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’లో ఓ ప్రత్యేకత ఉంది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌, ప్రభుదేవా ముఖ్య పాత్రల్లో నటించారు. డాన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘గర్మీ’ అనే గీతానికి నోరా ఫతేహి చేసిన మూవ్‌ మెంట్స్‌ నిజంగానే తెరపై సెగలు పుట్టించాయి. ఈ సినిమాలో నోరా ఫతేహి కెనడియన్‌ డాన్సర్‌గా ఒక ప్రత్యేకమైన కేశాలంకరణలో కనిపించింది. కథ, పాత్రలు డిమాండ్‌ చేస్తే ఎంతైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. ఇప్పటికే హీరో, హీరోయిన్ల లుక్‌ కోసం భారీగా ఖర్చుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’లో నోరా ఫతేహి కేశాలంకరణకు అక్షరాలా రూ.2.5 లక్షలు ఖర్చు చేశారట. ”ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌తో కలిసి పోటాపోటీగా చేసిన డాన్స్‌ సన్నివేశంలో సరైన లుక్‌ రావటానికి ప్రత్యేక పోనీటైల్‌ను వాడారట. ఈ చిత్రం షూటింగ్‌ దుబాయిలో జరుగుతున్నప్పుడు కస్టమ్‌ మేడ్‌ పోనీటైల్‌ను ఒక మేకప్‌ నిపుణుడు తయారు చేశాడట. డ్యాన్స్‌ చేసేటప్పుడు నిజానికి ఆ పోనీటైల్‌ చాలా బరువుగా అనిపించేదని కానీ, సన్నివేశం పండటానికి నా లుక్‌ చాలా స్పెషల్‌గా ఉండాలని నోరా దానిని ఎంచుకుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu