YS Jagan Latest Controversy:
గత అయిదేళ్లుగా YS Jagan ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, ప్రభుత్వ నిధులను అనవసరంగా ఖర్చు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2019 నుండి 2024 వరకు జారీ చేసిన అధికారిక జీవోలు, చార్జ్ చేసిన బిల్లులను బయటపెడుతూ, విపక్షాలు జగన్ ప్రభుత్వం కోట్లు రూపాయలు దోచుకుందని ఆరోపించాయి.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో YS Jagan అధికారం కోల్పోవడంతో, ఆయన పాలనలో జరిగిన ఆర్థిక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై సీరియస్‌గా స్పందించి, విస్తృతమైన విచారణ ఆదేశించడంతో మరిన్ని షాకింగ్ న్యూస్‌లు వెలుగులోకి వస్తున్నాయి.
తాజా ఆరోపణల ప్రకారం, ముఖ్యమంత్రి కార్యాలయం గత ఐదేళ్లలో ఉద్యోగులకు ఎగ్ పఫ్‌లు అందించడంలో 3.62 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వెల్లడైంది. ఈ మొత్తంతో, సుమారు 993 ఎగ్ పఫ్‌లు ప్రతిరోజూ వినియోగించారని, మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్‌లు ఐదేళ్లలో వినియోగించారని తెలుస్తోంది.
ఈ విషయంపై రాజకీయవర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా, జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కోసం భద్రతా సిబ్బందిని విపరీతంగా నియమించడం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణం, ప్రత్యేక విమానాలు మరియు హెలికాప్టర్ల వినియోగం వంటి అంశాలు కూడా అధికార దుర్వినియోగానికి ఉదాహరణలుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ క్రమంలో, ఎగ్ పఫ్ వివాదం ఇప్పుడు కేంద్రంలో హాట్ టాపిక్ గా నిలిచింది. చాలా మంది జగన్ మోహన్ రెడ్డిని ‘వెరీ గుడ్డు’ జగన్ అన్నా అని ఎద్దేవా చేస్తున్నారు.