ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటారని ఎవరు అనుకోవడం లేదు. మ్యారేజ్ చేసుకునే ఏజ్ నుంచి సల్లు భాయ్ దాటేశారని ఫీల్ అవుతున్నారు. ఇక మిగిలింది ప్రభాస్ మాత్రమే. అందుకని, అందరూ ఆయన పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారని చూస్తున్నారు. ‘బాహుబలి’, ఆ తర్వాత ‘సాహో’తో డార్లింగ్ క్రేజ్ ఇంటెర్నేషల్ లెవల్ కు వెళ్ళింది.
ముందు ‘మిర్చి’, ఆ తర్వాత ‘బాహుబలి’, అంతకు ముందెప్పుడో చేసిన ‘బిల్లా’ సినిమాల్లో అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని అనుకున్నారంతా! అయితే, తమది స్నేహం అని వాళ్లిద్దరూ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ పుణ్యమా అని కృతి, ప్రభాస్ మధ్య ఏదో ఉందని ఫీలవుతున్నారు. ప్రభాస్ ఎవరితో ప్రేమలో ఉన్నాడో ఎవరికీ తెలియదు కానీ ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిసారి మ్యారేజ్ టాపిక్ వస్తోంది. తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
ఎప్పుడు చేసుకున్నా తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని అభిమానులకు ప్రభాస్ మాట ఇచ్చాడు. అక్కడి వరకు బాగుంది కానీ ప్రభాస్ మాట నమ్మొచ్చా అని డై హార్డ్ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవడం గురించి కాదు వాళ్ళ డౌట్! అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా? అని! ప్రభాస్ మనసులో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా? అని! ఇప్పుడు ప్రభాస్ వయసు 43 ఏళ్ళు. పాన్ ఇండియా సినిమాలు కంప్లీట్ చేయాలని త్వరపడుతున్నాడు. అది ఏదో పెళ్లి విషయంలో తొందరపడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. త్వరగా ప్రభాస్ ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు