రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం ‘శశివదనే’. తాజాగా ఈ సినిమా నుండి ‘డీజే పిల్లా..’ లిరికల్ సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శరవణ వాసుదేవన్ సంగీతం అందించగా, కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించాడు. ఈ గీతాన్ని యువ గాయకుడు వైశాగ్ ఆలపించాడు.
గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నారు.
చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ “మా ‘శశివదనే’ సినిమా హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం” అని వెల్లడించారు.