HomeTelugu Trendingవిడిపోయిన మరో బాలీవుడ్ జంట

విడిపోయిన మరో బాలీవుడ్ జంట

9 1
బాలీవుడ్‌ సెలబ్రిటీలకు విడాకులు కొత్త విషయమేమీ కాదు. రోజుకో జోడీ అనే రీతిలో డైవోర్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దియామీర్జా తన 11 ఏళ్ల వివాహబంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ డీమిడియాలో వెల్లడించింది. తాము విడిపోయామని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ పెట్టింది. నా జీవితంలో ఇప్పటి వరకు సహకరించిన ప్రతీ ఒక్కరు ఎప్పటిలానే సపోర్ట్‌ను అందించాలి. ప్రస్తుతం భావోద్వేగాల మధ్య ఉన్నాం, మా ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ విజ్ఞప్తి చేసింది.

దియామీర్జాకు 11 ఏళ్ల క్రితం సాహిల్ సంఘాతో వివాహం జరిగింది. దాంపత్య జీవితం సవ్యంగానే సాగింది.. కొన్ని వ్యక్తిగత కారణాలతో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో పరస్పర అవగాహనతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. విడాకుల తర్వాత మేమిద్దరం స్నేహితుల మాదిరిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాం అని లేఖలో తెలిపారు. అంతే కాదు, మా ఇద్దరికి ఒకరంటే మరొకరికి ప్రేమ, గౌరవం ఉంది.. కానీ, మా జీవన ప్రయాణం రెండు వేర్వేరు మార్గాల్లో కొనసాగుతుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని దియామీర్జా తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu