బిగ్‌బాస్ ఫేం దివి ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో హౌస్‌లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. అంతకు ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షీ’ నటించినప్పటికి రాని గుర్తింపు బిగ్‌బాస్ తర్వాత ఒక్కసారిగా వచ్చింది. దీంతో ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ఈ మధ్య దివి పలు ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూల్లో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇంతవరకు ఎక్కడ తన వ్యక్తిగత విషయాలపై ఒపెన్ కానీ బిగ్‌బాస్ బ్యూటీ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి పంచుకుంది. కాగా కొంతకాలం కిందట ఓ వ్యక్తితో ప్రేమలో పడిన దివి కొన్ని కారణాల వల్ల వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు ఇదివరకే ఆమె తల్లి చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దివి సింగిల్‌గా ఉంటుంది. తాజాగా ఇంటర్య్వూలో తన పెళ్లిపై ప్రశ్నించగా.. కేరీర్ ఇప్పడే ప్రారంభమైంది. దానికి ఇంకా టైం ఉందని సమాధానం ఇచ్చింది.
ఇక కాబోయే వాడు ఎలా ఉండాలని హోస్ట్ అడగ్గా.. ‘అందరి అమ్మాయిలకు ఉన్నట్లే నాకు కూడా కాబోయే వాడు ఇలా ఉండాలనే కోరికలు ఉన్నాయి. నా హైట్ 5.8 కాబట్టి నా కాబోయే భర్త కనీసం 6.3 అడుగు ఉండాలని కోరుకుంటున్నా. అతడు తెలివైనవాడు అయి ఉండాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలి. అలాగే నన్ను ప్రేమగా చూసుకోవాలి’ అని తెలిపింది. ఇక కష్టసుఖాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పేవాడు అయితే ఒక అమ్మాయికి అంతకంటే కావలసింది ఏముందని, తనకు కూడా అలాంటి భర్త రావాలని కోరుకుంటున్నానంటు తనకు కాబోయే వాడి ఎలా ఉండాలో స్పష్టం చేసింది. మరీ తనకు దగ్గ అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి దివి లైఫ్‌లోకి త్వరలో రావాలని ఆశిద్దాం.