బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల ముందు తన మేనేజర్ దిశ సాలియన్ కూడా ఓ అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే సుశాంత్, దిశ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైన సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ 9 రాత్రి ముంబైలోని మలద్ ప్రాంతంలో దిశ ప్రియుడు రోహాన్ నివాసంలో పార్టీ జరిగింది. ఆ పార్టీలో దిశ తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు, మరికొంత మందితో కలిసి పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఆమె పార్టీ జరిగిన అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పార్టీలో దిశ తన స్నేహితులతో సంతోషంగా డాన్స్ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.