Disha Patani: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీనిలో ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ సాంగ్ యూత్‌ని ఊపు ఊపేసింది. ఆ పాటలో సమంత తన అందంతో అభినయంతో అదరగొట్టేసింది. దేవిశ్రీ సంగీతం, ఇంద్రావతి స్వరం, చంద్రబోస్ సాహిత్యం ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయని అని చెప్పాలి.
ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్స్ ‘పుష్ప2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఈ సినిమాలో ఐంటమ్ సాంగ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో తొలి పార్ట్‌లోని ఐటమ్నంబర్కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండబోతుందట.
అందుకే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశారట దర్శకుడు సుకుమార్. తొలి పార్ట్‌లోని పాటను మించేలా ఈ సాంగ్‌ని దేవిశ్రీ స్వరపరిచినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్ చిత్రీకరించనున్నారట. దిశా పటానీ పూరీజగన్నాథ్ ‘లోఫర్’లో నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్లో ఎం.ఎస్.ధోనీ, బాగీ2, బాగీ3, ఏక్ విలన్ రిటర్న్స్ తదితర చిత్రాల్లో నటించి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏ.డి’, సూర్య కంగువ చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తుంది.