HomeTelugu Trending'పుష్ప'లో ఐటమ్‌ గాళ్‌గా బాలీవుడ్‌ బ్యూటీ

‘పుష్ప’లో ఐటమ్‌ గాళ్‌గా బాలీవుడ్‌ బ్యూటీ

Dishapatani item song in Pu

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్ కోసం ఓ హాట్‌ బ్యూటీని వేతుకుతున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ దిశాపటానీని సంప్రదించాడు. కానీ ఈ అమ్మడు ఒక్క స్పెషల్ సాంగ్‌కి దాదాపు రూ.1.5కోట్ల పారితోషికం డిమెండ్‌ చేసింది. దాంతో అమ్మడికి ఓకే చెప్పాలా..వద్దా అని సుకుమార్ టీం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో ఆమెకు అంత పారితోషికం ఇవ్వడానికి సుకుమార్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో హిందీలో సినిమాకు బిజినెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రతి సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండటం కామన్ అయింది. గతంలో సుకుమార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో జిగేలు రాణి పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అడియన్స్‌లో కూడా ఐటమ్‌ సాంగ్స్‌కు మంచి క్రేజ్‌ వుంది. అందుకనే దర్శకనిర్మాతలు సినిమాలో పక్కా ఓ ఐటెం సాంగ్‌ను ఉంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu