HomeTelugu Big Storiesబాలీవుడ్‌ హీరోయిన్‌కి చంపేస్తామంటూ కాల్స్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌కి చంపేస్తామంటూ కాల్స్‌

Disha patani

టాలీవుడ్‌లోవరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమాతో పరిచయమైన బ్యూటీ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్‌లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా.

కాగా ఈ బ్యూటీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట. దిశాపటానీ కు ఫోన్‌ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్‌ స్టేషన్లకు కూడా కాల్స్‌ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్‌ పాకిస్తాన్‌ నుంచి వస్తున్నట్లు, కాల్‌ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్‌ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu