బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఫిట్‌నెస్ వర్కవుట్స్ చేయడమంటే చాలా ఇష్టం. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పోస్ట్ చేసే వీడియోలే నిదర్శనం. కఠినమైన వర్కవుట్స్‌ను కూడా దిశా తేలికగా చేసేస్తుంటారు. కాగా.. దిశా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ రాకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో దిశా కిక్ బాక్సింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ఒక్క రోజులో దాదాపు 25 లక్షల మందికిపైగా వీక్షించారు. దిశాకు ఫిట్‌నెస్‌పై ఉన్న ఆసక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తన వర్కవుట్స్ గురించి గతంలో దిశా వోగ్ ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతూ..’నేను రోజూ వర్కవుట్స్ చేస్తుంటాను. ఉదయాన్నే కార్డియోతో నాకు రోజు మొదలవుతుంది. డ్యాన్సింగ్, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ కూడా చేస్తుంటాను. సాయంత్రం వేళల్లో వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటాను. ప్రొటీన్, కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటాను. మహిళలు కేవలం కార్డియో మాత్రమే చేయగలరన్నది చాలా మంది అభిప్రాయం. కానీ ఆడవాళ్లు బరువులు కూడా ఎత్తగలరు. మా జిమ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తుంటారు.’ అని వెల్లడించారు.
ప్రస్తుతం దిశా ‘భారత్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా ట్రాపేజ్ ఆర్టిస్ట్ పాత్రలో కన్పించనున్నారు.