హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్య కేసు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ “దిశ ఎన్‌కౌంటర్ ” పేరుతో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే వర్మ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు మరో అప్‌డేట్ వచ్చింది. “దిశ ఎన్‌కౌంటర్ ” సినిమా ట్రైలర్‌ను వర్మ రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. దిశ ఘటన జరిగిన నవంబర్ 26న సినిమా విడుదల చేస్తామని వర్మ తెలిపాడు.