దిశ హత్యాచార కేసులో ఏ4గా చెన్నకేశవులు అనే నిందితుడు ఉన్న సంగతి తెలిసిందే. దిశ కేసు రీ కన్‌స్ట్రక్షన్ కోసం తీసుకు వెళ్ళిన సమయంలో పోలీసుల మీదకు దాడికి తెగబడడంతో వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో గర్భవతిగా ఉన్న చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు సంబంధించిన వివరాలను ఆ ఊరి ప్రభుత్వ పాఠశాల నుంచి అధికారులు సేకరించారు. పాఠశాలలో ఉన్న తేదీ ప్రకారం ఆ బాలిక వయసు 13 సంవత్సరాల ఆరు నెలలుగా గుర్తించారు. దీంతో ఆమె మైనర్ అని తేలింది.
ఆ బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె బాబాయి, నానమ్మల సంరక్షణలో పెరిగింది. దగ్గరి బంధువు అయిన చెన్నకేశవులును ప్రేమించి పెళ్లాడిన తర్వాత ఆ బాలిక అత్తారింటికి వచ్చింది. చెన్న కేశవులు భార్య మైనర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ కు పంపించాలని బృందం కోరింది. చెన్నకేశవులు భార్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె చిన్నాన్నతో బృందం చర్చించింది. ఆమె ప్రస్తుతం గర్బవతి కావడంతో అందుకు చెన్నకేశవులు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రస్తుతం బాబాయి ఇంట్లో ఉంటున్న చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ్ముడినైనా పంపించాలని కోరగా బాధితురాలు చెన్నకేశవులు భార్య చెల్లెలు తమ వద్దే ఉంటుందని కావాలంటే ఆమె తమ్మున్ని బాలల సంరక్షణ కేంద్రానికి పంపిస్తామని అతడి బాబాయ్ అధికారులకు వెల్లడించారు.